అమెజాన్‌ను బూడిద చేస్తోన్న కార్చిచ్చు..!
🎬 Watch Now: Feature Video
దక్షిణ అమెరికా బ్రెజిల్‌లోని అమెజాన్ అడవిలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. బ్రెజిల్‌లోని మాటో గ్రాస్సో రాష్ట్రంపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉంది. దావానలానికి కారణం ఓ వ్యక్తి సిగరెట్‌ను ఆర్పేయకుండా కింద పడేయడమేనని స్థానికులు వెల్లడించారు. మంటలు ఆర్పేందుకు సైన్యాన్ని వినియోగించాలని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సేనరో ఆదేశాలు జారీ చేశారు. 2019లో ఇప్పటివరకు 77వేల కార్చిచ్చు ఘటనలు రేగాయని వెల్లడించారు విశ్లేషకులు. బ్రెజిల్‌లోని 60 శాతం కార్చిచ్చులకు కారణం మానవ తప్పిదమేనని తెలిపారు.
Last Updated : Sep 28, 2019, 4:27 AM IST