ఇటలీలో చల్లారని నిరసన జ్వాలలు
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్కు నిరసనగా ఇటలీ ప్రజలు చేపట్టిన నిరసనలు తారస్థాయికి చేరాయి. రోమ్ నగరంలో వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వారిని చెదరగట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఐరోపాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలను విధించింది ఇటలీ ప్రభుత్వం.