ETV Bharat / state

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా - కొత్త తేదీ ఇదే! - APPSC GROUP 2 MAINS EXAM POSTPONED

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా - జనవరి 5న జరగాల్సిన మెయిన్స్ ఫిబ్రవరి 23కు వాయిదా

APPSC Group 2 Mains Exam Postponed
APPSC Group 2 Mains Exam Postponed (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 7:59 PM IST

APPSC Group 2 Mains Exam Postponed : వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వాయిదా వేసింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్షను జనవరి 5న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీని రీషెడ్యూల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్​ రాసే అవకాశం ఉంది. సిలబస్​లో మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు ఇటీవల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా ఏపీపీఎస్సీ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.