మర్యాదగా మాట్లాడమంటే తోసి చంపేసింది! - USA
🎬 Watch Now: Feature Video
బస్సులో తోటి ప్రయాణికులతో దురుసుగా మాట్లాడొద్దని చెప్పినందుకు 74ఏళ్ల వ్యక్తిని బస్సులో నుంచి తోసేసింది ఓ అమెరికా మహిళ. కిందపడి తీవ్రగాయాల పాలైన అతను నెల రోజుల తర్వాత మరణించాడు. మార్చి 21న లాస్ వేగాస్లో జరిగిందీ ఘటన. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను హత్యానేరం కింద అరెస్టు చేశారు. బస్సులో నుంచి వృద్ధుడ్ని తోసేసినప్పటి వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చింది.