భారీ కొండచిలువను పట్టేసి.. సంచిలో చుట్టేసి - hongkong man catches snake
🎬 Watch Now: Feature Video
పాములంటే ఎంతటి వారికైనా హడల్. అందులోనూ మనిషి కన్నా పొడవుండే కొండచిలువలను చూస్తేనే భయమేస్తుంది. కానీ, హాంకాంగ్‌కు చెందిన కెన్ లీ మాత్రం 3 మీటర్ల పొడవుండే బర్మీస్ కొండచిలువలను అవలీలగా పట్టేస్తున్నాడు. చేతి తొడుగులు, కర్ర, కొక్కీలు, టార్చ్, సంచుల వంటి చిన్నచిన్న పరికరాలతో భారీ సర్పాలను బందిస్తున్నాడు. కొన్ని సార్లు అయితే పాములు పట్టేందుకు ఒట్టి చేతులనే ఉపయోగిస్తాడు. ఓ ఇంట్లో స్నానాల గదిలోని పైపులో దూరిన పామును కెన్‌లీ ఒడుపుగా పట్టుకున్నాడు. అతడు పామును పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.