'కరోనా రూల్స్' వద్దంటూ విధ్వంసం- పోలీసులపై సీసాలతో దాడి - germany virus restrictions
🎬 Watch Now: Feature Video
Germany Corona protest: జర్మనీలో కరోనా నిబంధనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా మాగ్డేబర్గ్ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో కొందరు ఘర్షణకు దిగారు. పోలీసు సిబ్బందిపై సీసాలు, బాణసంచా విసిరి విధ్వంసం సృష్టించారు. అయితే.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. జర్మనీలో రోజుకు సగటున 30 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆంక్షలు అమలుచేస్తోంది.