బైడెన్‌తో బాక్సింగ్ మ్యాచ్‌కు సై అంటున్న ట్రంప్ - బెడన్కు ట్రంప్ సవాల్
🎬 Watch Now: Feature Video

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో బాక్సింగ్ మ్యాచ్‌కు సై అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ ఎవాండర్ హోలీఫీల్డ్, విటోర్ బెల్ఫోర్ట్ మధ్య శనివారం జరగనున్న ఎగ్జిబిషన్ బాక్సింగ్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడారు ట్రంప్. ఈ సందర్భంగా.. 'నేను ఎవరినైనా సవాల్ చేయాల్సి వస్తే.. బహుశా జో బైడెన్‌పై సులభంగా గెలుస్తాను. నన్ను జైల్లో పెడతానని గతంలో చెప్పారు. అలా చేస్తే ఆయనే పెద్ద సమస్యల్లో చిక్కుకుంటారు. నా ఆలోచన ప్రకారం మ్యాచ్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ఓడిపోతారు' అని పేర్కొన్నారు ట్రంప్.
Last Updated : Sep 10, 2021, 4:53 PM IST