ఆహా! పాదముద్రలతో మంచుపై అందమైన కళాకృతులు - ఫిన్నిష్​ డ్రాయింగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 11, 2021, 7:53 PM IST

ఫిన్​లాండ్​ రాజధాని హెల్సెంకి సమీపంలో అద్భుతమైన స్నో(మంచు) డ్రాయింగ్​ అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. ఫిన్నిష్​ కళాకారుడు జాన్నే పీకో.. తన కాలి అడుగులతో ఈ అద్భుత కళాఖండాలను రూపొందించారు. మంచులో పాదముద్రలతో గీసిన ఈ అందమైన కళాఖండాలు.. చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. సుమారు 160 మీటర్ల వ్యాసంలో ప్రదర్శితమైన ఈ డ్రాయింగ్​.. నార్డిక్(స్వీడన్​, నార్వే, ఫిన్​లాండ్​, డెన్మార్క్​, ఐస్​లాండ్​)​ దేశాలలోనే అతిపెద్ద మంచు కళాఖండంగా పేరుగాంచింది. దీన్ని రూపొందించేందుకు వలంటీర్ల బృందంతో కలిసి రెండు రోజుల పాటు శ్రమించారు పీకో.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.