చిలీ నిరసనలు మరింత ఉద్రిక్తం - చిలీలో కొనసాగుతున్న నిరసనలు...20 మంది మృతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5007984-55-5007984-1573269557222.jpg)
చిలీ రాజధాని శాంటియాగోలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్కెనాన్స్, బాష్పవాయువులను ప్రయోగించారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో 20 మంది చనిపోగా.. 2500 మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిలీ రాజధానిలో జరగాల్సిన రెండు ప్రధాన అంతర్జాతీయ సదస్సులను రద్దు చేశారు.