ట్రాక్టర్ బోల్తా... 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ - వాషింగ్టన్
🎬 Watch Now: Feature Video
అమెరికా రాజధాని వాషింగ్టన్ చుట్టూ ఉన్న అంతరాష్ట్ర క్యాపిటల్ బెల్ట్ వే రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అలెక్జాడ్రియా సమీపంలో రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడటమే ఇందుకు కారణం. ట్రాక్టర్ ట్రైలర్లో మంటలు చెలరేగి వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు 8 కిలోమీటర్ల మేర రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.