ఆస్ట్రేలియా కార్చిచ్చు ఉగ్రరూపం.. 20 ఇళ్లు దగ్ధం - క్వీన్స్‌లాండ్
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో కార్చిచ్చు చెలరేగింది. ఓ పంట పొలంలో రాజుకున్న మంటలు.. పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి దావానంలా వ్యాపించాయి. అగ్నికీలల ధాటికి 20 ఇళ్ల వరకూ.. పూర్తిగా దగ్ధమయ్యాయి. హెలీకాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వేడి గాలుల బీభత్సంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి.