భద్రాద్రి సీతమ్మ తల్లికి 'మా అమ్మకు మా సారె' - RAMAYYA SITHAMMA SARE
🎬 Watch Now: Feature Video
ఖమ్మం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతమ్మ తల్లికి విజయవాడకు చెందిన భక్తులు మా అమ్మకు మా సారె కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా మహిళలంతా కలిసి సారెను భద్రాద్రి రామయ్య సన్నిధికి తీసుకువచ్చారు. అనంతరం నిత్య కల్యాణ మండపంలో ఉన్న సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ చలివిడి పూలు పండ్లు మిఠాయిలు సమర్పించారు.