ప్రతిధ్వని: కరోనా కాలంలో పెరిగిన బాల్య వివాహాలు.. - బాల్య వివాహాలపై ప్రతిధ్వని చర్చా కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
ప్రపంచాన్ని కల్లోలం చేసిన కరోనా మహమ్మారి బాలికల బంగారు జీవితానికి మోయలేని గుదిబండగా మారింది. ఇదే సమయంలో అనూహ్యంగా పెరిగిన బాల్య వివాహాలు చిన్నారుల జీవితాలకు తెగని సంకెళ్లు పేనుతున్నాయి. బాల్య వివాహాల మూఢాచారంపై దశాబ్దాల పాటు పోరాడి సాధించిన ప్రగతి కాస్తా వృథాగా మారే ప్రమాదం ముంచుకోస్తోంది. ఇప్పటికీ ఉన్న పరిస్థితులే అమానవీయం అనుకుంటుంటే కరోనా వేళ చాపకింద నీరులా పెరిగిన బాల్య వివాహాలు మరింత కలవర పెడుతున్నాయి. కట్టుదిట్టమైన చట్టాలు, జీవోలు పర్యవేక్షణ యంత్రాంగాలు ఉన్నా ఈ సమస్యను ఎందుకు నిలువరించ లేకపోతున్నాయనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.