అదరహో అనిపించిన ముద్దుగుమ్మల హంసనడకలు - High life Fashion Logo Launch
🎬 Watch Now: Feature Video
సినీ కథానాయిక సలోనిమిశ్రా అందాలు....మెరుపు తీగలాంటి ముద్దుగుమ్మల వయ్యారి హంసనడకలు ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ యువ కథానాయిక సలోనిమిశ్రా, నిర్వహకులు డొమినిక్‌తోపాటు పలువురు మోడల్స్ పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఫ్యాషన్‌లో పలువురు డిజైనర్లు రూపొందించిన మోడ్రన్, వెస్ట్రన్, సంప్రదాయ దుస్తుల్లో సుందరాంగులు ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో ఆకట్టుకున్నారు.