అభిషేక శివుడు - బాసర ఆలయం
🎬 Watch Now: Feature Video
బాసరలో శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేకువ జామున మహాదేవునికి గోదావరి జలాలు, పంచామృతాలతో అభిషేకం గావించారు. గోదావరి నదికి దీపారాధన, పుష్పార్చన చేశారు. అనంతరం నదీ తీరాన దక్షిణామూర్తి సహిత రుద్రయాగం నిర్వహించారు. లింగాకృతిలో దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.