సి.కల్యాణ్‌పై నిర్మాతల మండలి సభ్యుల ఆగ్రహం వీడియో చూశారా - తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్
🎬 Watch Now: Feature Video
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి కార్యవర్గ గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలువురు నిర్మాతలు వారం రోజుల నుంచి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతల మండలి ఈసీ సమావేశాన్ని నిర్వహించింది. సుమారు 30 మందికిపైగా నిర్మాతలు హాజరై ఎన్నికలు జరుపాలని పట్టుపట్టారు. ఈ దశలో వీడియో తీస్తున్న ఓ సభ్యుడిగా సి.కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం నిర్మాతల మండలిలో కాసేపు దుమారం రేపింది. ఆ తర్వాత ఈసీ సమావేశాన్ని నిర్వహించిన సి.కళ్యాణ్... దీక్షలు విరమిస్తేనే ఎన్నికల తేదీని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. దీంతో నిర్మాతలు ఆందోళన విరమించారు. ఫిబ్రవరి 26న నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST