'నాటు నాటు'కు సైకత శిల్పి స్పెషల్​ విషెస్​.. చరణ్​, ఎన్టీఆర్​ చిత్రాలను ఇసుకతో.. - నాటు నాటు సాండ్​ ఆర్టిస్ట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 15, 2023, 9:57 PM IST

సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్​ పురస్కారాన్ని అందుకుని భారత దేశానికి అపూర్వ ఖ్యాతి తెచ్చిపెట్టింది తెలుగు చిత్రం ఆర్ఆర్​ఆర్​. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్​ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డు దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు అలా ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ కూడా ప్రత్యేక అభినందనలు చెప్పారు. తాజాగా అదే రాష్ట్రంలోని పూరీకి చెందిన అంతర్జాతీయ సైకత శిల్పి మానస్​ కుమార్​ సాహు.. ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ను సాండ్​ యానిమేషన్​తో అభినందించారు. ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలోని హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు ఆస్కార్​ ట్రోఫీను ఇసుకతో మానస్​ చిత్రీకరించారు. కాగా, నాటు నాటు పాటను పాటను చంద్రబోస్​ రచించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.