ట్యూషన్ ఫీజు డబ్బులతో వడ్డీ వ్యాపారం.. చిన్నప్పుడే రానా దందా! - సుమ అడ్డా పరేషాన్ మూవీ
🎬 Watch Now: Feature Video
Suma Adda Rana Daggubati : టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే వడ్డీ వ్యాపారం చేసేవారట. అది కూడా ట్యూషన్ మాస్టర్‌కు ఇవ్వాల్సిన డబ్బులతో! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ట్యూషన్‌కు వెళ్లకుండా, ఆ డబ్బులను కొందరికి వడ్డీకి ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'సుమ అడ్డా' గేమ్ షోకు.. తాను నిర్మించిన 'పరేషాన్' సినిమా బృందంతో కలిసి అతిథి విచ్చేశారు రానా. ఆ కార్యక్రమంలో నిర్వహించే గేమ్స్‌ను 'పక్కా బిజినెస్ మైండ్'తో ఆడుతూ నవ్వులు పూయించారు. తనదైన శైలిలో వరుస పంచ్‌లు వేస్తూ.. యాంకర్ సుమనే అవాక్కయ్యేలా చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి చేసిన 'భీమ్లా నాయక్' సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు రానా. సుమ అడ్డా గేమ్‌షోలో రానా ఎంత సందడి చేశారో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే.
ఇదీ చూడండి :
చిన్నప్పటి ఇంట్లో రానా సందడి.. ఆమెతో కలిసి వంటింట్లో పిజ్జా చేస్తూ..
లగ్జరీ బంగ్లా.. ఖరీదైన కార్లు.. 'రానా' లైఫ్ స్టైల్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!