Rangamarthanda: 'ఇకపై నా సినీ జీవితం అలా ఉంటుందని అనుకుంటున్నా' - రంగమార్తాండ బ్రహ్మానందం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 24, 2023, 9:29 PM IST

కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాన్ని ప్రేక్షకులు కళ్లతో కాకుండా గుండెతో ఆస్వాదిస్తున్నారని ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం అన్నారు. విడుదలకు ముందు ఆ తర్వాత ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచ ఆదరణ లభిస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన బ్రహ్మానందం... ఇక తన నట జీవితం రంగమార్తాండకు ముందు రంగమార్తాండ తర్వాత అనుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ తన కార్యాలయంలో బ్రహ్మానందాన్ని పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణవంశీ మాట్లాడుతూ..  ఈ సినిమాలో చక్రి పాత్రకు బ్రహ్మానందాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరించారు. " క్లైమాక్స్‌లో చక్రి పాత్రకు సంబంధించి ప్రతి సన్నివేశాన్ని చాలా పరిశీలించి రాశాను. కరోనా వల్ల నాకు ఆలోచించుకోవడానికి చాలా సమయం దొరికింది. ఆ పాత్రకు బ్రహ్మానందం మాత్రమే న్యాయం చేస్తారని అనిపించింది. ఎందుకంటే.. ప్రకాశ్‌రాజ్‌- బ్రహ్మానందం మధ్య సీన్స్​ చూస్తే ఆ చక్రి పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. కొన్ని డైలాగులు తెలుగులో ఆయనలా స్పష్టంగా మరెవరూ చెప్పలేరు. బ్రహ్మానందం అయితే ఈ పాత్రకు 100 శాతం న్యాయం చెయ్యగలరనుకున్నా. ఆయన వెయ్యి శాతం చేశారు. కొన్ని సీన్స్​ తీసేటప్పుడు అవి బాగా రావాలని అన్నం కూడా తినలేదు. సుమారు 1200  సినిమాలు చేసినా ఈ సినిమానే మొదటి సినిమా అన్నట్లు చేశారు. నేను కథ చెప్పడానికి వెళ్లగానే వెంటనే ఓకే చేశారు. ఈ సినిమాలో చెప్పినన్ని డైలాగులు కెరీర్‌ మొత్తంలో కూడా చెప్పి ఉండరు" అని అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.