గజరాజు బీభత్సం.. వాహనాలను వెంబడించి.. ఆపై.. - తమిళనాడు కోయంబత్తూర్ ఏనుగు దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2022, 1:50 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

Elephant attacking forest guards: తమిళనాడు కోయంబత్తూర్‌లోని అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో.. ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. గస్తీ నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బందిపైకి ఒక్కసారిగా తిరగబడింది. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న వాహనాల్లో తప్పించుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా ఏనుగు వదల్లేదు. వారి వాహనాలను వెంబడిస్తూ.. అధికారులను బెంబేలెత్తించింది. రెండు వాహనాలపై ఏనుగు దాడికి యత్నించగా.. ఒకరు గాయపడ్డారు. గజరాజు వెంటబడిన దృశ్యాలను ఓ అధికారి తన కెమెరాలో బంధించారు. మార్చి 13న ఈ ఘటన జరగగా, ఇందుకు సంబంధించిన దశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.