న్యూలుక్లో ఛత్తీస్‌గఢ్ సీఎం.. ధూమ్ స్టైల్లో బైక్ రైడింగ్..
Bhupesh Baghel Bike Riding: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ న్యూలుక్లో కనిపించారు. ధూమ్ స్టైల్లో బైక్ రైడ్ చేస్తూ అభిమానులను అలరించారు. రాష్ట్రంలో 'నేషనల్ సూపర్ క్రాస్ బైక్ రేసింగ్ ఛాంపియన్స్ 2022' జరగనున్న నేపథ్యంలో స్పోర్ట్స్ బైక్‌ను నడిపారు. సీఎం ధైర్యంగా రైడింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రేసింగ్ ఛాంపియన్స్ మార్చి 6న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మార్చి 5నుంచి ప్రాక్టీస్ రైడింగ్ నిర్వహించనున్నారు. ఈ ఛాంపియన్స్‌లో పాల్గొనడానికి విదేశాల నుంచి ఆటగాళ్లు రాయ్‌పుర్‌కు వచ్చారు. బంగమట్టిపై జరిగే ఈ రేసింగ్‌లో చిన్నపిల్లలు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలో అడ్వెంచర్ స్పోర్ట్స్, టూరిజంను ప్రోత్సహించడానికి బుధపరా అవుట్డోర్ స్టేడియంలో మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ టోర్నమెంట్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST