ETV Bharat / sports

T20 వరల్డ్​కప్ థీమ్ సాంగ్ రిలీజ్- మీరు విన్నారా? - 2024 Womens T20 World Cup

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

2024 Womens T20 World Cup Song :2024 మహిళల టీ20 వరల్డ్​కప్ సాంగ్​ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం లాంఛ్ చేసింది. మరి మీరు ఆ పాట విన్నారా?

2024 Womens T20 World Cup
2024 Womens T20 World Cup (Source : Getty Images)

2024 Womens T20 World Cup Song : 2024 మహిళల టీ20 వరల్డ్​కప్ సాంగ్​ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం లాంఛ్ చేసింది. ఈ పాటను మైకీ మెక్​క్లర్క్, పార్త్ పరేఖ్ కంపోజ్ చేయగా, ఇండియన్ సింగర్ బాండ్ విష్ (Band W.i.S.H) గ్రూప్ పాడింది. 1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో మహిళల వరల్డ్​కప్​లో గతంలో జరిగిన మూమెంట్స్​ను చూపించారు. మరి మీరు ఆ పాట విన్నారా?

కాగా, ఈ ప్రతిష్ఠాత్మకమైన ట్రోర్నమెంట్ అక్టోబర్ 03 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 28- అక్టోబర్ 1 వరకు వార్మప్‌ మ్యాచ్​​లు జరగనున్నాయి. ఈ టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది.

2 స్టేడియాల్లో మ్యాచ్​లు
ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దుబాయ్ ఇంటర్నేషల్ స్టేడియం 2009లో ప్రారంభమైంది. ఇందులో 25,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 1982లో నిర్మితమైన షార్జా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 200కు పైగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు జరిగాయి. దక్షిణాసియాలో ఈ స్టేడియం బాగా ప్రాచుర్యం పొందింది.

భారీగా పెరిగిన ప్రైజ్​మనీ
2024 టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. 7,958,080 అమెరికా డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో రూ.66 కోట్లకు పైమాటే. దీంతో విజేతలకు ఇచ్చే ప్రైజ్​మనీ కూడా పెరిగింది. గతేడాది జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా ఆ జట్టుకు 1 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అదే ఈసారి ఈ ప్రైజ్ మనీని 2.34 మిలియన్ డాలర్లకు పెంచారు. అంటే ఏకంగా 134 శాతం పెరిగింది. భారత కరెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విన్నర్​కు దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రైజ్ మనీ అందుతుంది.

Team India Squad For WC : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తిక భట్టీయా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన

ఫిట్​నెస్ క్లియరెన్స్ - రాధా యాదవ్, సజన సజీవన్, శ్రేయాంక పాటిల్

ట్రావెలింగ్ రిజర్వ్ - ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకోర్

వేదికలు ఫిక్స్, ఓ రేంజ్​లో ప్రైజ్​మనీ- ఉమెన్స్​ T20 వరల్డ్​కప్ ఫుల్ డిటైల్స్ ఇవే! - Womens T20 World Cup 2024

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- వరల్డ్​కప్​ మ్యాచ్​లకు వారికి ఫ్రీ ఎంట్రీ - T20 World Cup 2024

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.