హొయలుపోయిన మోడళ్లు - హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లోగో అవిష్కరణ కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 9, 2019, 3:26 AM IST

అందమైన అమ్మాయిలు విభిన్నమైన డిజైనర్‌వేర్‌ వస్త్రాల్లో మెరిసిపోయారు. తమ సొగసైన హంస నడకలతో వయ్యారంగా ర్యాంప్‌పై అడుగులేస్తూ... అదరహో అనిపించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లోగో అవిష్కరణ కార్యక్రమం నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో... మిస్‌ గ్రాండ్‌ ఇండియా శివాణి జాదవ్‌, మిస్‌ ఇండియా తెలంగాణ సంజన విజ్‌, ఫెమినా మిస్‌ ఇండియా శ్రేయా శంకర్‌, వర్ధమాన కథానాయిక అవాంతిక హరి నల్వా మోడల్స్‌తో కలిసి సందడి చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో... దేశ, విదేశాలకు చెందిన దాదాపు 250కిపైగా  ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు డామిన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.