ఈ-బైక్ రైడ్‌తో 'పెట్రో బాదుడు'పై మమత నిరసన
🎬 Watch Now: Feature Video
దేశంలో పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. కోల్‌కతా నగర మేయర్ ఫిర్హద్ హకీమ్ స్కూటర్ నడపగా.. మమత హెల్మెట్ ధరించి వెనక కూర్చున్నారు. పెట్రోల్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ మెడలో ఫ్లకార్డు వేసుకుని 5 కి.మీ ప్రయాణించారు దీదీ. మోదీ ప్రభుత్వ తప్పుడు వాగ్దానాల వల్లే ఇంధన రేట్లు పెరిగాయన్న ఆమె.. ప్రజా వ్యతిరేక పాలనతో మోదీ, షా దేశాన్ని అమ్మేస్తున్నారని విమర్శించారు.
Last Updated : Feb 25, 2021, 2:13 PM IST