కూలీ కోసం కన్నీరు పెట్టిన వానరం - కూలీ కోసం ఏడ్చిన కోతి వీడియో
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్‌లోని గిరిడీహ్ ప్రాంతంలో ఓ బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ కూలీ మృతదేహం వద్ద వానరం రోదిస్తూ కనిపించింది. మృతుడిని హత్తుకొని గంటల కొద్ది కన్నీరు కార్చింది. ఈ సన్నివేశం చూసినవారందరూ కన్నీరుమున్నీరయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఆ వ్యక్తి.. కోతికి ఆహారం అందిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక మరణంతో కోతి ఏడవడం అందరికీ ఆశ్చర్యంలోకి పడేసింది.