రంగు తెచ్చిన తంట- వీరంగం సృష్టించిన ఆవు - వైరల్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 13, 2021, 12:30 PM IST

హరియాణాలోని కురుక్షేత్రలో ఓ ఆవు వీరంగం సృష్టించింది. రోడ్డుపై ఎరుపు రంగు దుస్తుల ధరించి కనిపించిన వాళ్లందరినీ కుమ్మేసింది. సైకిల్​ మీద వెళ్తున్న బాలుడితో మొదలు పెట్టి.. కాపాడేందుకు వచ్చిన మహిళను, రోడ్డు పక్కన వెళ్తున్న వారితో సహా ఎవరినీ వదల్లేదు. ఆవుని అక్కడ నుంచి పంపే ప్రయత్నం చేసిన వారిపై కూడా తన ప్రతాపం చూపింది. ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే పిల్లలు, పెద్దలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.