Viral Video: ఘనంగా గజ'రాజు' బర్త్డే వేడుక - ఉత్తర్ప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ మథుర జిల్లా చుర్మురా గ్రామంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రంలో రాజు అనే ఏనుగు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. గజరాజుతో కేక్ కోయించిన నిర్వాహకులు.. పుచ్చకాయ, దోసకాయ, అరటి పండ్లు అందించారు. వాటిని ఆరగించిన అనంతరం ఈతకొలనులో సరదాగా గడిపింది ఏనుగు. గజ'రాజు'కు ప్రత్యేకమైన రోజు ఉండాలనే వేడుకలను ఏర్పాటుచేసినట్లు 'ఎస్‌ఓఎస్' సంస్థ ప్రతినిధి బైజు తెలిపారు.
Last Updated : Jul 6, 2021, 5:57 PM IST