కేంద్ర మంత్రి క్రికెట్ ఆడితే ఇలా ఉంటుంది! - union minister Nitin Gadkari plays cricket in Nagpur
🎬 Watch Now: Feature Video
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్రికెట్ ఆడారు. 'ఖాస్దార్ క్రీడా మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర నాగ్‌పుర్ ఛత్రపతి నగర్‌లోని పలు మైదానాలను సందర్శించారు. బ్యాట్ పట్టి ఇలా సిక్సులు, ఫోర్లు కొడుతూ యువతను ఉత్సాహపరిచారు మంత్రి. 'యువకులతో కలిసి క్రికెట్ ఆడకుండా నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను' అంటూ ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు.