అయోధ్యలో కనువిందు చేసిన సంధ్యాసమయం
🎬 Watch Now: Feature Video
సరికొత్త చరిత్రకు నాంది పలికిన అయోధ్యలోని సరయూ నదీ తీరంలో సంధ్యా సమయం కనువిందు చేసింది. ఉదయం నుంచి రామమందిర భూమిపూజ క్రతువును వీక్షించిన సూర్యుడు పశ్చిమాన వాలిపోతూ సరికొత్త అనుభూతిని పంచాడు. సరయూ నదికి సాయంత్రం ఇచ్చే హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తీరానికి చేరినపుడు సంధ్యాసమయం అద్భుతంగా కనిపించింది. నదికి ఆవలి ఒడ్డును సూర్యుడు తాకాడా అన్నట్లు భాస్కరుడు అస్తమించాడు.