చీరతో యువతి చేసిన ఫీట్లకి సోషల్ మీడియా ఫిదా! - మల్లీ సర్కార్
🎬 Watch Now: Feature Video
బంగాల్‌కు చెందిన 18 ఏళ్ల మిల్లీ సర్కార్ అద్భుతమైన ఫీట్లు చేస్తూ అందరినీ ఔరా! అనిపిస్తోంది. ఈ యువతి ఇటీవల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాలో హీరో చేసినట్లుగా.. చీరలో ఎంతో సులువుగా ఫీట్లు చేస్తోంది. ఈమెది బంగాల్లోని రాయ్‌గంజ్. చిన్ననాటి నుంచే యోగా మీద ఉన్న ఆసక్తితో ఆసనాలు వేయడం అలవాటు చేసుకున్న మిల్లీ... 2018లో మహారాష్ట్రలో జరిగిన అఖిల భారత యోగా పోటీలో బంగారు పతకం సాధించింది.