తలోజా జైలు నుంచి అర్ణబ్ విడుదల
🎬 Watch Now: Feature Video
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు...రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు అర్ణబ్‌తో పాటు మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు ముంబయి పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి.. తలోజా జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. ఆయన్ను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో తలోజా జైలుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. విడుదలైన అనంతరం కారు మీద నిలబడి.. నినాదాలు చేశారు అర్ణబ్. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆరెస్ట్ అయిన అర్ణబ్‌కు సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ జారీ చేసింది.