పొలిటీషియన్ కాళ్లకు పోలీసు నమస్కారం.. వీడియో వైరల్ - పోలీస్ యూనిఫామ్‌లో పొలిటీషన్ పాదాలకు మొక్కి..
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వి.డి. శర్మ పాదాలకు నమస్కరించారు.స్టేషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న దినేశ్ ప్రజాపతి.. యూనిఫామ్‌లో ఉండి ఇలాంటి పని చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యేందుకు శర్మ ఉజ్జయినికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికే క్రమంలో సదరు పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.