శానిటైజర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- యువకుడు మృతి - man burnt to death due to sanitizer in gujarat
🎬 Watch Now: Feature Video
శానిటైజర్ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం గుజరాత్, రాజ్కోట్, కొఠారియా ప్రాంతంలోని శానిటైజర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అశ్విన్ పాన్సూరియా అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. డీవీఆర్లో స్పార్క్ రావడం, పక్కనున్న శానిటైజర్లకు నిప్పు అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
TAGGED:
gujarat