thumbnail

10 కోడి గుడ్లను కక్కిన పాము- వీడియో వైరల్​

By

Published : Jun 30, 2021, 8:11 AM IST

మహారాష్ట్ర చంద్రాపుర్ జిల్లా కోసాంబి గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. ఓ పాము 10 కోడి గుడ్లను కక్కింది. గ్రామంలోని పవన్ లొన్​బలె ఇంట్లోకి పాము ప్రవేశించింది. పామును చూడగానే ఇంట్లో గుడ్లపై పొదిగిన కోడి.. భయంతో పారిపోయింది. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని పాముల సంరక్షకునికి తెలియజేశారు. అతడు వచ్చేలోపే పది గుడ్లను మింగేసింది పాము. ఆ తర్వాత వచ్చిన పాముల సంరక్షకుడు.. ఆ సర్పాన్ని పట్టుకున్నాడు. మింగిన గుడ్లను పాము వెల్లగక్కింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.