రోడ్డుపై యువతి అదిరిపోయే డాన్స్- షాకిచ్చిన పోలీసులు - ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13080796-thumbnail-3x2-yviii.jpg)
ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ యువతి చేసిన డాన్స్ వీడియో వైరల్గా (girl dance viral video) మారింది. అయితే అదే వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో రసోమా స్క్వేర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడగానే జీబ్రా క్రాసింగ్ మీదకు చేరుకొని డాన్స్ చేసింది(girl dance viral video) సదరు యువతి. దీనికి సామాజిక మాధ్యమాల్లో భారీగా స్పందన కూడా లభించింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే.. ఆ యువతి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.