చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్!
🎬 Watch Now: Feature Video
తమిళనాడు ఈరోడ్ జిల్లా సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి, ఇంటి ముందు నిద్రిస్తున్న శునకాన్ని శుక్రవారం రాత్రి చాకచక్యంగా వేటాడింది. సత్యమంగళం పర్యటక ప్రాంతం కావడం వల్ల, ఇక్కడ వందల సంఖ్యలో లాడ్జీలు, రిసార్ట్లు ఉన్నాయి. వాటికి కాపలాగా మేలు జాతి శునకాలూ ఉన్నాయి. సెప్టంబర్ 29న ఓ చిరుత రిసార్ట్ ముందు నిద్రిస్తున్న ఓ శునకాన్ని వేటాడేందుకు వచ్చింది, కానీ శునకం తప్పించుకుంది. రెండు వారాల వ్యవధిలోనే తిరిగి అదే ప్రాంతంలో మరో గుమ్మం ముందు విశ్రాంతి తీసుకుంటున్న ఓ శునకాన్ని 3 నిమిషాల పాటు మాటువేసి మరీ ఆహారంగా చేసుకుంది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.