ETV Bharat / state

హైదరాబాద్​లో పెరుగుతోన్న ఆ కేసులు - బయట తినేవాళ్లు కాస్త జాగ్రత్త! - FOOD POISONING CASES IN HYDERABAD

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు - బయట ఫుడ్​ తినేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్న వైద్యులు

Food Poisoning
Food Poisoning Cases in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 8:42 AM IST

Food Poisoning Cases in Hyderabad : హైదరాబాద్​ మహా నగరంలో ఫుడ్​ పాయిజనింగ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాసిరకం, నిల్వ చేసిన ఆహారంతో వంటకాలు తయారు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్​కు చెందిన ఓ మహిళ మోమోస్​ తిని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కల్తీ ఆహారంతో ఇబ్బంది పడుతూ ఉస్మానియా, గాంధీ, ఫీవర్​ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

ఇంత దారుణ పరిస్థితులా? : ఆహార భద్రత అధికారులు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 8624 సార్లు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడ చూసినా నాసిరకం, కుళ్లిన ఆహార పదార్థాలను ఫ్రిజుల్లో నిల్వ చేయడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం, వివిధ రకాల హానికర రంగులు వంటివి వాడటం, వంట గదుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే వారికి కనిపించింది.

1 గంట నుంచి 36 గంటల్లోపు ఎప్పుడైనా : ఇలాంటి పరిస్థితులు ఉన్న హోటళ్లలో తింటే, ఆహారం తిన్న తర్వాత గంట నుంచి 36 గంటల వరకు ఎప్పుడైనా ముప్పు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. సాల్మోనెల్లా, క్యాంపిలో బాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియాలు, లిస్టెరియా, నోరోవైరస్‌లు ఫుడ్‌ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. దీంతోపాటు వివిధ రకాల డ్రగ్స్, టాక్సిక్స్‌తో ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై కలుషిత ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

ఏదైనా తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే ఫుడ్​ పాయిజన్ అయినట్లే :

  • వాంతులు
  • విరేచనాలు
  • వికారం
  • అధిక జ్వరం
  • కడుపులో నొప్పి
  • పొత్తి కడుపు తిమ్మిరి
  • యూరిన్‌ నిలిచిపోవడం
  • ఆకలి లేకపోవడం
  • చలి, కండరాల నొప్పి

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం : 'పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగినట్లు గుర్తించాలి. ఈ లక్షణాలు కనిపించగానే వెంటనే అప్రమత్తం కావాలి. వాంతులు, విరేచనాలు అవుతుంటే బాధితుడికి ఓఆర్‌ఎస్‌ తాగించాలి. అది లేకపోతే తగినంత ఉప్పు, పంచదార కలిపి తాగిస్తూ ఉండాలి. ఫ్రిజ్‌లో కూరగాయల మధ్యలో పచ్చి మాంసం ఉంచితే అందులోని బ్యాక్టీరియా కూరగాయల్లోకి చేరుతుంది. అప్పుడు ఫుడ్​ పాయిజన్​ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌క్రీమ్‌ తినొద్దు.' - డాక్టర్‌ రమేష్, సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు, ఉస్మానియా ఆసుపత్రి

తిన్న తర్వాత కడుపులో నొప్పి, మంటగా ఉంటుందా? వదిలేస్తే క్యాన్సర్​గా మారే ఛాన్స్​!

అలర్ట్​ : రెస్టారెంట్లలో కుళ్లిన ఆహారం - తప్పక వెళ్తే ఇవి మాత్రమే తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.