సాహో సైనికా.. నీ తెగువకు సాటిరారెవరైనా..! - ఆర్మీ డే
🎬 Watch Now: Feature Video
Indian Army Day: 'ఆర్మీ డే' సందర్భంగా భారత సైన్యం ప్రత్యేక వీడియో విడుదల చేసింది. జవాన్ల తెగువను, దేశం కోసం వారు చేసే నిస్వార్థ సేవలను చాటిచెప్పేలా ఈ వీడియోను రూపొందించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఏటా జనవరి 15న భారత సైన్యం.. ఆర్మీ డే జరుపుకుంటుంది. 1949లో బ్రిటిష్ అధికారి స్థానంలో.. భారత సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్గా ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప బాధ్యతలు స్వీకరించడానికి గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తుంది.