'భాజపా కార్యకర్తలైనందుకే చెట్లకు కట్టేసి కొట్టారు' - bengal bjp
🎬 Watch Now: Feature Video
బంగాల్లో మరో హింసాత్మక ఘటన వెలుగు చూసింది. దినాజ్‌పుర్ జిల్లాలోని రాయ్గంజ్లో కొందరు యువకులను చెట్లకు కట్టేసి చితకబాదారు. ఈ దాడికి పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ నేతలే అని, భాజపా కార్యకర్తలుగా ఉన్నందుకే దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత టీఎంసీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగంపైనా తమకు అనుమానం కలుగుతోందని భాజపా పేర్కొంది. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. పొలం నుంచి ఆవులను తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని, భాజపా కార్యకర్తలు అయినందునే కొట్టారనడం పచ్చి అబద్ధం అని తెలిపింది. దీనిని భాజపా కుట్రగా అభివర్ణించింది.