'కరోనాపై పోరాటం కోసం హోమం చేయాల్సింది' - కరోనాపై హేమ మాలిని
🎬 Watch Now: Feature Video
సామాజిక మాధ్యమంలో బాలీవుడ్ నటి, మథుర ఎంపీ హేమ మాలిని పెట్టిన ఓ సందేశం కాసేపటికే వివాదాస్పదమైంది. తన నియోజకవర్గంలోని ప్రజలను ఇంట్లో హోమం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో వాతావరణం శుద్ధి అవుతుందని, తద్వారా కరోనా సహా ఎలాంటి మహమ్మారినైనా జయించవచ్చని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ హోమం నిర్వహించారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.