లైవ్ వీడియో: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన వాహనం - రాజ్‌కోట్ వరదల్లో చిక్కుకున్న కారు
🎬 Watch Now: Feature Video

గుజరాత్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. రాజ్‌కోట్‌లో ప్రవహిస్తోన్న వరదనీటిలో ఓ బొలెరో వాహనం చిక్కుకుంది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. పక్కనే ఉన్న ట్రక్కు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈలోగా వరద ప్రవాహం పెరిగింది. వాహనంతో సహా వారిద్దరూ వరదలో కొట్టుకుపోయారు. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు తన చరవాణిలో బంధించాడు. సహాయక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.