చీరకట్టులో అదిరిపోయే స్టంట్స్- వీడియో వైరల్ - చీరలో జిమ్నాస్టిక్స్
🎬 Watch Now: Feature Video
హరియాణాకు చెందిన పారుల్ అరోరా అబ్బురపరిచే స్టంట్స్ చేశారు. అది కూడా చీరకట్టుకుని ఆమె జిమ్నాస్టిక్ చేయడం వీక్షలను మరింత అశ్చర్యానికి గురి చేసింది. అయితే తన స్నేహితురాలు ఇచ్చిన ఐడియాతోనే ఇలా చేశానని, చీరకట్టులో స్టంట్స్ చేయటం వల్ల ప్రజలు ఇష్టపడుతున్నారని తన సంతోషాన్ని'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు పారుల్. పారుల్ స్టంట్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఔరా! అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గతంలో పారుల్ అరోరా జిమ్నాస్టిక్స్ లో జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించారు.