వినూత్నంగా 'న్యూ ఇయర్' విషెస్- ఐస్క్రీమ్ పుల్లలతో.. - హ్యాపీ న్యూ ఇయర్
🎬 Watch Now: Feature Video
Happy new year 2022: కొత్త ఏడాదికి ఒడిశాకు చెందిన ఓ యువ కళాకారుడు వినూత్నంగా స్వాగతం పలికాడు. ఐస్క్రీమ్ పుల్లలతో 'హ్యాపీ న్యూ ఇయర్ 'అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. పూరీ జిల్లా కుముటి పట్నా ప్రాంతానికి చెందిన బిశ్వజిత్ నాయక్ ఈ కళారూపాన్ని తీర్చిదిద్డాడు. ఇందుకోసం అతడు 275 ఐస్క్రీమ్ పుల్లలను ఉపయోగించాడు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ సంతోషం, శ్రేయస్సు కలిగించాలని అతడు ఆకాంక్షించాడు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశాడు.