Elephant Attack Video: అతడ్ని వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు! - ఏనుగు దాడిలో వ్యక్తికి గాయాలు
🎬 Watch Now: Feature Video
అసోంలోని ధుబ్రి జిల్లాలోని స్థానికులపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్‌హాట్ ప్రాంతంలోని నదిలో నుంచి జనవాసాల్లోకి వచ్చిన ఏనుగు.. స్థానికులపై ప్రతాపం చూపింది. భయాందోళనతో ప్రజలు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పడిపోయాడు. అతడిని సమీపించిన ఏనుగు తొండంతో ఈడ్చిపడేసింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయిన తర్వాత యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అటవీశాఖ అధికారి వెల్లడించారు. స్థానికులపై దాడిచేసిన ఏనుగు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వివరించారు.