కోల్కతాలో నోట్ల వర్షం.. ఎందుకీ అద్భుతం! - KOLKATA
🎬 Watch Now: Feature Video
ఈ దృశ్యాలు చూసి శివాజీ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం అనుకుంటున్నారా..? కాదండి.. నిజంగా డబ్బులు గాల్లో ఎగురుతూ వచ్చి భూమిని తాకాయి. ఈ సంఘటన కోల్కతా బెన్టింక్ వీధిలోని హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ భవనం వద్ద చోటు చేసుకుంది. ఈ సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బుధవారం దాడులు చేశారు. వారి రాకను గమనించిన సంస్థ యాజమాన్యం ఆరవ అంతస్తు నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లను బయటకు విసిరేశారు.పై నుంచి పడుతున్న నగదును తీసుకోవటానికి ప్రజలు ఎగబడ్డారు.
Last Updated : Nov 21, 2019, 7:41 AM IST