పట్టపగలే బ్యాంకు దోపిడీ.. భారీగా బంగారం, నగదు చోరీ - బ్యాంకు దోపిడీ పూణే
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర పుణెలో పట్టపగలే భారీ చోరీ (Bank robbery Pune) జరిగింది. పింపర్ఖేడ్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోకి తుపాకులతో ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. ఉద్యోగులను బెదిరించి దోపిడీ (Pune robbery news) చేశారు. మేనేజర్‌ను చంపుతామని బెదిరించారు. క్యాషియర్‌కు తుపాకులు గురిపెట్టి.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ. రెండు కోట్ల విలువైన బంగారం, రూ.31 లక్షల నగదు తీసుకొని కారులో పారిపోయారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు జిల్లాలోని అన్ని వైపులా రోడ్లను నిర్బంధించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.