బావిలో పడిన గున్న ఏనుగు- రక్షించిన అధికారులు! - కొడగు న్యూస్
🎬 Watch Now: Feature Video
కర్ణాటక కొడగు జిల్లా దేవపుర ప్రాంతంలో.. బావిలో పడిన గున్న ఏనుగును రక్షించారు అటవీ శాఖ సిబ్బంది. తొలుత ఏనుగు అరుపులు విన్న ఓ కాఫీ తోట యజమాని అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. స్థానికుల సాయంతో ఏనుగును కాపాడేందుకు గంటల పాటు శ్రమించారు. ఎంతసేపటికీ ఏనుగు పైకి ఎక్కలేకపోవడం వల్ల భారీ తాళ్లతో సాయంతో బయటకు లాగారు. ఆహారం కోసం ఏనుగు కాఫీ తోటలోకి వచ్చి ఉంటుందని తెలిపారు.