మంటల్లో కాలి బూడిదైన కొవిడ్ రోగుల అంబులెన్స్! - మహారాష్ట్ర వార్తలు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో గ్రామీణ ప్రాంతల నుంచి కొవిడ్ రోగులను తరలించేందుకు ఉపయోగిస్తోన్న ఓ అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. జ్వాలలతో ఆ వాహనం పేలి తునాతునకలైంది. ఔరంగాబాద్-పుణే రహదారిపై వాలూజ్ సమీపంలో గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేనందున.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.