భార్య కోసం సెల్‌టవర్ ఎక్కిన భర్త - భార్యను కాపురానికి రప్పించేందుకు.. భర్త సూసైడ్ డ్రామా!
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో ఓ వ్యక్తి టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యను తిరిగి కాపురానికి రప్పించాలని డిమాండ్ చేశాడు గౌరీశంకర్. స్థానికులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా ఇంకాస్త పైకెక్కసాగాడు. మైసూర్‌లోని విద్యారణ్యపురంలో చోటుచేసుకున్న ఈ హైడ్రామాలో పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు గంటన్నరపాటు శ్రమించారు. భార్య కాపురానికి వచ్చేలా సాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పటంతో.. ఎట్టకేలకు కిందకు దిగొచ్చాడు గౌరీశంకర్.