వేగంగా వచ్చి కారును ఢీకొన్న బస్సు.. వీడియో వైరల్ - కేరళ రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తాన్ బేథరీ ప్రాంతంలోని ధొట్టపంకుళం వద్ద ఓ కారును ఢీకొట్టింది వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. బస్సు కల్పెట్ట నుంచి బేథరీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారును ఢీకొట్టి అమాంతం చెట్టుమీదకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. స్పందించిన స్థానికులు సహాయక చర్యలకు ఉపక్రమించారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవరు కోజికోడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.